రాష్ట్రం యావత్తూ గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం సాయుధబలగాల గౌరవవందనం స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కరోనా కారణంగా రాజ్‌భవన్‌లో ఈసారి ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.
చారిత్రక భవనాలు
జెండా పండుగకు భాగ్యనగరం అందంగా ముస్తాబైంది. నగరంలో ప్రభుత్వ, చారిత్రక భవనాలు త్రివర్ణశోభితంగా కాంతులీనుతున్నాయి. అసెంబ్లీ, జీఎస్టీ భవన్, బీఆర్కే భవన్, శాసనమండలి, నాంపల్లి పబ్లిక్ గార్డెన్, గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం విద్యుత్‌దీపపు కాంతుల్లో వెలిగిపోతున్నాయి.
రైల్ నిలయం
దక్షిణ మధ్య రైల్వే... భవనాలను దీపకాంతులతో అలంకరించింది. రైల్ నిలయం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదితర భవనాలను మూడు రంగులతో ముస్తాబుచేశారు.