తెలంగాణ

telangana

ETV Bharat / state

హనుమంతుడి జన్మస్థలంపై ఆధారాలతో సిద్ధం కండి: ఈవో - ap latest news

శ్రీరామనవమి పర్వదినాన తగిన ఆధారాలతో హనుమాన్ జన్మస్థలాన్ని నిరూపించేందుకు సిద్ధం కావాలని పండితులకు తితిదే ఆలయ కార్యనిర్వాహక అధికారి జవహర్ రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం అర్చకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

TTD
తిరుమల

By

Published : Apr 20, 2021, 10:40 AM IST

హనుమంతుడి జన్మస్థలం సప్తగిరుల్లోని అంజనాద్రిగా శ్రీరామనవమి పర్వదినాన తగిన ఆధారాలతో నిరూపించేందుకు సిద్ధం కావాలని తితిదే ఈవో జవహర్‌రెడ్డి పండితులను కోరారు. ఈ నేపథ్యంలో పండితులతో ఈవో సోమవారం సమీక్షించారు.

శ్రీరామనవమి నాడు..

శ్రీ రామనవమి నాడు శ్రీవారి ఆలయంలో పూజల అనంతరం నాద నీరాజనం వేదికపై ఉదయం 11 గంటలకు హనుమంతుడి జన్మస్థలంపై తగిన ఆధారాలతో భక్తులకు తెలియజేయాలని ఈవో.. ఆలయ పండితులకు చెప్పారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వీసీ ఆచార్య మురళీధర శర్మ, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు దక్షిణామూర్తి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్‌ ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు ఈ అంశంపై చర్చించారు.

ఇదీ చదవండి:ఐసీఎస్​ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు

ABOUT THE AUTHOR

...view details