ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిసెట్-2020 ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా అడ్మిషన్లు లభిస్తాయి. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షలకు విధిగా హాజరుకావాల్సి ఉంటుంది.
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ ఆధ్వర్యంలో పాలిసెట్-2020 అడ్మిషన్ నోటిఫికేషన్ మార్చి 2న విడుదల చేసింది. దీనిలో ప్రభుత్వ ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 4 డిప్లొమా కోర్సుల ప్రవేశాలు కూడా పాలిసెట్ మార్గదర్శక సూత్రాల్లో పొందుపరిచారు. పాలిసెట్-2020 ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 31 ఆఖరు గడువు. వర్సిటీ వివిధ కోర్సుల ప్రవేశం కోసం ప్రత్యేకంగా అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.