తెలంగాణ

telangana

ETV Bharat / state

HUGE BOUQUET: లిమ్కా బుక్‌ రికార్డ్స్‌ కోసం.. భారీ పుష్ప గుచ్ఛం - ఇనిస్టిట్యూట్ ఆఫ్​ హోటల్​ మేనేజ్​మెంట్​ తాజా వార్తలు

HUGE BOUQUET: హైదరాబాద్​ విద్యానగర్​లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్​ హోటల్​ మేనేజ్​మెంట్​ 50 వసంతాలు పూర్తి చేసుకోవడంతో.. కళాశాల స్వర్ణోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా భారీ పుష్పగుచ్ఛాన్ని విద్యార్థులు రూపొందించారు.

HUGE BOUQUET
భారీ పుష్పగుచ్ఛం

By

Published : Apr 8, 2022, 10:02 AM IST

HUGE BOUQUET: హైదరాబాద్​ విద్యానగర్​లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్​ హోటల్​ మేనేజ్​మెంట్​ 50 వసంతాలు పూర్తి చేసుకోవడంతో.. కళాశాల స్వర్ణోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఏదైనా ఒక రికార్డు సాధించాలని.. మేనేజ్​మెంట్​ భావించింది. అజాదీకా అమృత్​ మహోత్సవ్​లో భాగంగా.. ‘లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ కోసం భారీ పుష్పగుచ్ఛాన్ని విద్యార్థులు రూపొందించారు. గురువారం పలు రకాలకు చెందిన 53,516 పుష్పాలను వినియోగించి 30 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో కళాశాల ప్రాంగణంలో దీన్ని తయారు చేశారు.

ఇటీవల లిమ్కా బుక్ఆఫ్ రికార్డు సాధించేందుకు.. 10 మంది పాకశాస్త్ర నిపుణులు, 20 నుంచి 30 మంది విద్యార్థులు.. 4 గంటల పాటు శ్రమించి 75 రకాల బిర్యానీలను తయారు చేశారు. వాటి ప్రాధాన్యతను తెలియజేసేలా.. బోర్డులను ఏర్పాటు చేసినట్లు హోటల్​ మేనేజ్​మెంట్​ విభాగాధిపతి తెలిపారు. రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయామని.. 75 రకాల బిర్యానీ వంటకాల్లో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.

ఇదీ చదవండి: 75 TYPES OF BIRYANI: ఒకే చోట 75 రకాల బిర్యానీలు.. ఎక్కడోకాదు మన హైదరాబాద్​లోనే..

ABOUT THE AUTHOR

...view details