తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో రూ.100 దాటిన ప్రీమియం పెట్రోల్ ధర - petrol price in andhra

పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి బండిని బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. ఏపీలో ప్రీమియం పెట్రోల్ ధర రూ. 101.48 కి చేరింది.

premium petrol price in andhra pradesh
ఏపీలో రూ.100 దాటిన ప్రీమియం పెట్రోల్ ధర

By

Published : May 12, 2021, 11:59 AM IST

ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్ భారం కూడా మరింత తోడైంది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెంచేశారు. ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.98.22, డీజిల్‌ రూ.92.06 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.101.68గా ఉంది.

విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.02, డీజిల్‌ రూ.91.86, లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.101.48గా పెరిగింది.

ఇదీ చదవండి:చుట్టుముడుతున్న మానసిక సమస్యలు... ఆందోళనలో వైరస్ బాధితులు

ABOUT THE AUTHOR

...view details