ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం సమావేశం దృష్ట్యా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అమరావతి రైతులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఉండవల్లిలో తాడేపల్లి పోలీసులు ముగ్గురు రైతులను అరెస్టు చేశారు. సమావేశం అనంతరం వదిలి పెడతామని పోలీసులు చెప్పారని కుటుంబసభ్యులు తెలిపారు.
ఏపీ మంత్రివర్గం సమావేశం దృష్ట్యా రైతుల ముందస్తు అరెస్టులు - అమరావతిలో రైతుల ముందస్తు అరెస్టులు
ఏపీ మంత్రివర్గ సమావేశం దృష్ట్యా అమరావతి రైతులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సమావేశం అనంతరం విడిచిపెడతామని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరమే నిరసనలు చేపట్టాలని పోలీసులు.. రైతులకు, మహిళలకు చెప్పారు.
![ఏపీ మంత్రివర్గం సమావేశం దృష్ట్యా రైతుల ముందస్తు అరెస్టులు amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8472865-902-8472865-1597811984368.jpg)
ఏపీ మంత్రివర్గం సమావేశం దృష్ట్యా రైతుల ముందస్తు అరెస్టులు
మధ్యాహ్నం వరకు రైతులు, మహిళలు శిబిరం వద్దకు రావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. మంత్రివర్గ సమావేశం ముగిశాకే అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి:కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!