"గో సడక్ బంద్"కు పిలుపునిచ్చిన యుగతులసి ఫౌండేషన్ సభ్యులను పోలీసులు అరెస్టులు చేశారు. గో హత్యలు నివారించాలని, గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ యుగతులసి ఫౌండేషన్ సడక్ బంద్‌కు పిలుపునిచ్చింది. భారీగా తరలివచ్చిన గో సంరక్షకులతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఎల్బీనగర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడంతో పోలీసులు భారీగా మోహరించారు.
'గో సడక్ బంద్' నేపథ్యంలో ముందస్తు అరెస్టులు - Members of the Yugatulasi Foundation
'గోవును జాతీయ ప్రాణి'గా ప్రకటించాలంటూ యుగతులసి ఫౌండేషన్ గో సడక్ బంద్‌కు పిలుపునిచ్చింది. ముందస్తుగా గో రక్షకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
'గో సడక్ బంద్' నేపథ్యంలో ముందస్తు అరెస్టులు
యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శివకుమార్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, మీర్‌పేట్ ప్రాంతాల్లో గో భక్తులను అరెస్టు చేశారు. ఈ నెల 15న చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి బహదూర్‌పుర వరకు పాదయాత్ర చేపడతామని శివకుమార్ తెలిపారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Last Updated : Jan 8, 2021, 11:12 AM IST