పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణీని... గ్రామస్థులు 10కి.మీ మేర డోలీలో మోసుకుని రహదారి మార్గానికి తీసుకువచ్చిన ఘటన ఏపీ విశాఖ మన్యంలోని జి.మాడుగులలో చోటుచేసుకుంది. రోడ్డు సౌకర్యం లేక కొండల నడుమ అంత దూరం వెళ్లినా... అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులు మీడియాకు సమాచారమిచ్చారు.
ఘటనపై ఈటీవీ సకాలంలో పోలీసులకు సమాచారం చేరవేసింది. వారు వెంటనే స్పందించి.. హుటాహుటిన అంబులెన్స్‌ను పంపించడంతో ప్రమాదం తప్పింది.