ఏపీలోని ప్రకాశం జిల్లా మార్కాపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ నిండు గర్భిణి నడిరోడ్డుపై ప్రసవించింది. ఈ ఘటన సాయి సింధూర వైద్యశాల ఎదుట చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిని కొవిడ్ వైద్యశాలగా మార్చారు. ప్రస్తుతం అక్కడి ప్రసూతి వార్డును తాత్కాలికంగా ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు.. సాయి సింధూర ఆస్పత్రికిి తరలించారు. బెస్తవారిపేట మండలం గార్లకుంటకు చెందిన గర్భిణి త్రివేణి.. పురిటినొప్పులు వస్తుండగా కుటుంబ సభ్యులు మధ్యాహ్నం 2 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు.
వైద్యుల నిర్వాకం... నడిరోడ్డుపైనే ప్రసవం - ap news
పురిటి నొప్పులతో వచ్చిన ఓ గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు వైద్యులు నిరాకరించారు. చివరికి.. ఆసుపత్రి ఎదుటే ప్రసవం జరిగింది. ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ ఘటన చూసిన వారందరూ వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
![వైద్యుల నిర్వాకం... నడిరోడ్డుపైనే ప్రసవం delivery before hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:21:10:1620917470-ap-ong-81-13-dharunam-road-pai-garbini-av-ap10071-13052021181320-1305f-1620909800-589.jpg)
ఏపీ వార్తలు
వైద్యులు ఆమెకు మంచం కేటాయించకుండా.. గంటల తరబడి వైద్యశాల బయటే ఉంచేశారు. ఎంత బతిమాలుకున్నా ఫలితం లేక.. ఆమెను ఒంగోలు తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. అదే సమయంలో... నొప్పులు ఎక్కువై.. నడి రోడ్డుపైనే ప్రసవించింది. ఈ ఘటన చూసిన వారు ఆస్పత్రి సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితే తమకూ ఎదురైందని మరో గర్భిణి బంధువులు తీవ్ర ఆవేదన చెందారు.
ఇదీ చూడండి:'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'