పది నిమిషాల పాటు కూర్మాసనం వేసి అనకాపల్లికి చెందిన కొణతాల జ్యోతి అనే మహిళ అరుదైన ప్రపంచ రికార్డు నెలకొల్పి గిన్నిస్ బుక్‌లో స్థానం సాధించారు. గతంలో నిండు గర్భిణీగా ఉన్న సమయంలో ఆమె క్లిష్టమైన 40 ఆసనాలు వేసి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన జ్యోతి.. దశాబ్దకాలంగా భర్త విజయ్‌తో కలిసి చైనాలో నివాసముంటున్నారు.
Guinness record: 10 నిమిషాల కూర్మాసనంతో.. గిన్నిస్ రికార్డుకెక్కిన మహిళ..! - kurmasana Guinness Book of World Records latest news
పది నిమిషాల పాటు కూర్మాసనం వేసిన జ్యోతి అనే మహిళ గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పింది. బుధవారం దీనికి సంబంధించిన ధ్రువపత్రాన్ని ఆమె అందుకుంది.
నిండు గర్భిణి కుర్మాసనం.. ప్రపంచ రికార్డు సొంతం!
గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో పది నిమిషాల పాటు కూర్మాసనం వేసిన వీడియోను రికార్డ్ చేసి పంపింది. వారి నుంచి ఈనెల 9న ఆమోదం లభించగా.. బుధవారం ఆమెకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ధ్రువపత్రం అందించినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: బ్లాక్ ఫంగస్ రోగులకు సరోజినీదేవి ఆసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు
Last Updated : May 28, 2021, 4:35 PM IST