తెలంగాణ

telangana

ETV Bharat / state

వెలుగులు పంచే పండుగలో జర భద్రం సుమీ!! - Diwali festival

Precautions to Diwali festival: దీపావళి పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమయ్యారు. చిన్నా పెద్దా అంతా కలిసి బాణాసంచా కాల్చుతూ తమ అనందాన్ని పొందనున్నారు. దీపాలంకరణలతో నిర్వహించుకునే దీపావళిని సంతోషంగా జరుపుకుని విషాదాన్ని దరిదాపులకు రాకుండా చూసుకోవాలని అంటున్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. బాణసంచా విక్రయించే దుకాణదారులు అన్ని రకాల అనుమతులు తీసుకోవాలి. దుకాణాల్లో అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

Diwali festival
Diwali festival

By

Published : Oct 24, 2022, 8:50 AM IST

వెలుగులు పంచే పండుగలో జర భద్రం సుమీ

Precautions to Diwali festival: దీపావళి పండుగ రోజున బాణసంచా కాల్చడం పెద్ద అనందం. చిన్నా పెద్ద అంతా టపాసులు కాల్చుతూ సంతోషాన్ని పొందుతారు. బాణసంచా విక్రయించే దుకాణదారులు తప్పనిసరిగా దుకాణాల్లో ఇసుక, నీటి బకెట్లతో పాటు.. అగ్నిమాపక పరికరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని అనుమతులు తీసుకోవాలని కోరుతున్నారు.

అక్రమంగా టపాకాయలు నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఊహించని విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే.. ఘటనా స్థలానికి వేగంగా చేరుకునేందుకు జంటనగరాల్లో 18 అగ్నిమాపక కేంద్రాల్లోని అగ్నిమాపక శకటాలను అధికారులు అందుబాటులో ఉంచారు. బాణసంచా కాల్చుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది కాస్తా పండుగ సంబరాన్ని దూరం చేసే అవకాశం ఉంటుంది.

తయారీదారు వివరాలున్న బాణసంచానే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో దీపాలు వెలిగించే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు. కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్‌లో వేయాలని.. బకెట్‌ నిండా నీటిని, దుప్పట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. కళ్లకు ప్రమాదం జరుగుకుండా చూసుకోవాలని నూలు, ఖద్దరు బట్టలను మాత్రమే ధరించాలని చెబుతున్నారు.

టపాసులను చిన్న పిల్లలకు ఇవ్వకుండా పెద్దలు వెంట ఉండి బాణ సంచా కాల్చాలని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతునన్నారు. వెలుగుల దీపావళి పండుగను సంతోషంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అగ్నిమాపక శాఖ స్పష్టం చేస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details