'వరల్డ్ కిడ్నీ డే'ను పురస్కరించుకుని.. హైదరాబాద్, ఎల్బీనగర్లోని గ్లోబల్ హాస్పిటల్ 5కే సైక్లింగ్ నిర్వహించింది. కార్యక్రమాన్ని.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం ఆస్పత్రి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు.
'ముందు జాగ్రత్తతో కిడ్నీ వ్యాధులను అరికట్టొచ్చు'
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. హైదరాబాద్, ఎల్బీనగర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గ్లోబల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో జరిగిన 5కే సైక్లింగ్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
'ముందు జాగ్రత్తతో కిడ్నీ వ్యాధులను అరికట్టొచ్చు'
ముందు జాగ్రత్తతో కిడ్నీ సంబంధిత వ్యాధులను అరికట్టే అవకాశముందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతీ ఏడాది కిడ్నీ సమస్యలతో వేల మంది చనిపోతున్నారంటూ.. ప్రజలకు ఇంకా అవగాహన తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఎల్బీనగర్ నుంచి సైదాబాద్ వరకూ.. వైద్యులు, సిబ్బంది సైకిల్‌పై ర్యాలీగా వెళ్తూ అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి:బద్రినాథుణ్ని దర్శించాలంటే.. సిద్దిపేట వెళ్లాల్సిందే!