తెలంగాణ

telangana

ETV Bharat / state

జుట్టుకు హెన్నా అప్లై చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే మొదటికే మోసం! - Best Henna Appliying Tips

Precautions Before Applying Henna To Hair : జుట్టుకు మార్కెట్లో దొరికే హెన్నా వాడుతుంటారు చాలా మంది. అయితే.. అప్లై చేసే విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల మీ జుట్టు మెరిసిపోవడం సంగతేమోగానీ.. నిర్జీవంగా మారడం గ్యారెంటీ అంటున్నారు నిపుణులు. మరి.. ఆ మిస్టేక్స్ ఏంటో మీకు తెలుసా?

Precautions Before Applying Henna To Hair
Precautions Before Applying Henna To Hair

By ETV Bharat Telangana Team

Published : Nov 26, 2023, 12:16 PM IST

Precautions Before Applying Henna To Hair :జుట్టును హెల్దీగా చేసుకోవడానికి చాలా మంది గోరింటాకు అప్లై చేసుకుంటారు. తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉన్నవారు.. కవర్ చేయడానికి కూడా హెన్నా ఉపయోగిస్తారు. అయితే.. ఈ గోరింటాకును అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఈ విషయాలు గుర్తు పెట్టుకోండి..

  • హెన్నా తరచూ అప్లై చేసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కొందరు నెలకు మూడు లేదా నాలుగు సార్లు అప్లై చేసుకుంటారు. కానీ.. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు.
  • నెలకు ఒకసారి మాత్రమే హెన్నాను జుట్టుకు పట్టించాలని చెబుతున్నారు.
  • హెన్నాను జుట్టుకు పట్టించే మిశ్రమాన్ని చాలా మంది అప్పటికప్పుడు తయారు చేసుకుంటారు. ఇలా చేయడం కూడా మంచిది కాదు.
  • మీరు జుట్టుకు అప్లై చేసుకునే 4-5 గంటల ముందే మిశ్రమాన్ని తయారు చేసి పెట్టుకోవాలని చెబుతున్నారు.
  • ఇంకా చాలా మంది హెన్నాను జుట్టుపై ఎంత ఎక్కువసేపు ఉంచితే, అంత బాగా జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటారు. కానీ.. ఇలా ఎక్కువ సేపు ఉంచడం వల్ల హెన్నా జుట్టులోని తేమను గ్రహిస్తుందని నిపుణులు అంటున్నారు.
  • దీంతో జుట్టు విపరీతంగా పొడిగా మారుతుంది. హెన్నా వల్ల స్కాల్ప్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి, 1-2 గంటలకు మించి హెన్నా ఉంచకూడదు.
  • కొంతమంది పొడి జుట్టు మీదే హెన్నాను అప్లై చేసుకుంటారు. ఇలా అస్సలు చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల జుట్టు మరింత డ్రైగా తయారవుతుందని, రంగు కూడా బాగా కనిపించదని చెబుతున్నారు.
  • మెహందీని జుట్టుకు పెట్టుకునే ముందు హెయిర్ కండీషనర్‌ని వాడాలి. ఆ తరవాత హెన్నాను జుట్టుకు అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిగా మారదు.
  • కొంతమందికి మెహందీ పడకపోవచ్చు. దీంతో జుట్టు రాలడం, అలెర్జీ సమస్యలు రావచ్చు. అందుకే, జుట్టుకు హెన్నా రాసేముందే కాస్తంత మెహందీని తీసుకొని చర్మంపై రాసి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవాలి.

వయసు 40 దాటిందా? - ఈ 7 టిప్స్​తో యంగ్​గా కనిపించండి!

అరటి పండుతో మేలు..

హెయిర్‌కు మెహందీని అప్లై చేసేటప్పుడు, ఆ హెహందీ మిశ్రమంలో అరటి పండు గుజ్జు కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, గంట తరవాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్‌కు మరిన్ని పోషకాలు అందుతాయి. అరటి పండులోని యాంటీ ఆక్సిడెంట్స్ మాడ దురదను కూడా తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు.

కొబ్బరిపాలతో కండీషనర్‌గా..
మాడ సంబంధ సమస్యలను తొలగించుకోవడానికి కొబ్బరి పాలు చాలా ఉపయోగపడతాయి. ఇందుకోసం కొబ్బరిపాలను ఒక కప్పులోకి తీసుకొని కొద్దిగా వేడి చేయాలి. తరవాత కొబ్బరి పాలలోకి ఆలివ్‌ ఆయిల్‌ను వేసి కలపాలి. ఈ పాలను మెహందీలో మిక్స్‌ చేసి జుట్టుకు పట్టించాలి. గంట తరవాత షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరి పాలలోని లారిక్ ఆమ్లం మంచి యాంటీబయాటిక్‌గా పనిచేసి, మాడ సంబంధ సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. మెహందీలో కొబ్బరిపాలను కలపడం వల్ల మంచి కండీషనర్‌గా పనిచేస్తుందట.

చుండ్రు సమస్యకు..

టేబుల్‌ స్పూన్ హెన్నా, మరో టేబుల్‌ స్పూన్ ముల్తానీ మట్టిని తీసుకుని నీటిలో నానబెట్టి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలలో బాగా దురదపెడుతోన్న భాగంలో రాసి, అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుందని నిపుణులు అంటున్నారు.

పెసర పప్పు, ఎర్ర పప్పు - ఈ రెండిటిలో షుగర్ పేషెంట్స్​ ఏది తినాలి?

చపాతీలు మృదువుగా రావాలా? - పిండిలో ఇవి కలిపితే చాలు - భలే స్మూత్​గా వస్తాయి!

ABOUT THE AUTHOR

...view details