తెలంగాణ

telangana

ETV Bharat / state

Prawasi Telangana Diwas: దేశంలో తయారైన టీకా అద్భుతంగా పనిచేస్తోంది: కిషన్‌రెడ్డి - minister prashanth reddy

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ను ఆయన కోరారు. భారత్​లో తయారైన టీకా అద్భుతంగా పనిచేస్తోందన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ ఆధ్వర్యంలో ప్రవాసీ తెలంగాణ దివస్​ కార్యక్రమం జరిగింది.

Prawasi Telangana Diwas: దేశంలో తయారైన టీకా అద్భుతంగా పనిచేస్తోంది: కిషన్‌రెడ్డి
Prawasi Telangana Diwas: దేశంలో తయారైన టీకా అద్భుతంగా పనిచేస్తోంది: కిషన్‌రెడ్డి

By

Published : Dec 12, 2021, 6:39 PM IST

Updated : Dec 12, 2021, 9:12 PM IST

వ్యాక్సిన్​ అద్భుతంగా పనిచేస్తోంది: కిషన్​ రెడ్డి

Pravasi telangana diwas: హైదరాబాద్​ రవీంద్రభారతిలో తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ ఆధ్వర్యంలో ప్రవాసీ తెలంగాణ దివస్​ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి, రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్​ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, తెజస అధినేత కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డిలు హాజరయ్యారు.

వ్యాక్సిన్​ అద్భుతంగా పనిచేస్తోంది: కిషన్​ రెడ్డి

Pravasi telangana diwas: తెలంగాణ అభివృద్ధిలో ఎన్​ఆర్​ఐల పాత్రపై మంత్రులు ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని టీడీఎఫ్ ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ను కోరారు. కరోనా వస్తే కోట్లమంది చనిపోతారని అంతా అనుకున్నారని.. కానీ తక్కువ నష్టంతో బయటపడ్డామని కేంద్ర మంత్రి వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్​ను ఏడెనిమిది సంస్థలు మాత్రమే తయారుచేస్తున్నాయన్న కేంద్ర మంత్రి... అందులో భారతదేశంలో తయారుచేసిన వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తుందన్నారు. 130 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేశామని... ఇతర దేశాలకు కూడా త్వరలోనే అందిస్తామని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.

తక్కువ నష్టంతో బయటపడ్డాం..

కరోనా వస్తే కోట్లాదిమంది చనిపోతారని ప్రచారం జరిగింది. మహమ్మారి నుంచి తక్కువ ప్రాణనష్టంతో బయటపడ్డాం. కరోనా టీకాను ఏడెనిమిది సంస్థలే తయారుచేస్తున్నాయి. దేశంలో తయారైన టీకా అద్భుతంగా పనిచేస్తోంది.ఇప్పటివరకు 130 కోట్లకుపైగా కొవిడ్‌ టీకా డోసులు ఇచ్చాం.ఇతర దేశాలకు కూడా టీకా డోసులు త్వరలోనే పంపిస్తాం. -కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

ప్రైవేట్​ స్కూళ్లకు దీటుగా తీర్చుదిద్దుతాం: మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు

Pravasi telangana diwas: రాష్ట్రంలో 90 శాతం తెలంగాణ బిడ్డలు, వివిధ పార్టీల్లో ఉన్న వారు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు పేర్కొన్నారు. ఎన్​ఆర్​ఐలు గ్రామాలను అభివృద్ధి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై దృష్టిసారించాలని మంత్రి సూచించారు. పేద విద్యార్థులను ఆదుకోవాలని.. వారిని చదివించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు దీటుగా తీర్చుదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు.

ఇంకా చాలా ఉన్నాయి..

తెలంగాణ బిడ్డలంతా రాష్ట్రం కోసం పోరాటం చేశారు. వివిధ పార్టీల ఉన్నవారు కూడా తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ సాధించుకున్నం... ఆర్థికంగా ముందుకు వెళ్తున్నాం. ఇంకా చేసుకోవాల్సివి చాలా ఉన్నాయి. తప్పకుండా చేసుకుందాం. -ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్ర మంత్రి

రాజకీయాలకు అతీతంగా టీడీఎఫ్​ పనిచేయాలి : మంత్రి ప్రశాంత్​ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్​ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందిందని రాష్ట మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఎన్​ఆర్​ఐలు కూడా ఎంతగానో శ్రమించారని ఆయన పేర్కొన్నారు. పలు దేశాల్లో పనిచేస్తున్న ఎన్​ఆర్​ఐలు ఆ దేశాల్లోని టెక్నాలజీని రాష్ట్రానికి అందించేలా సహకరించాలని మంత్రి కోరారు. తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ అనేది రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగమని ప్రశంసించారు. రాష్ట్రంలో అనేక కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం ఎంతగానో అభివృద్ధి చెందిందని.. కాళేశ్వరం ద్వారా వేల ఎకరాలకు నీళ్లందుతున్నాయన్నారు. అనేక రంగాల్లో రాష్ట్రం సర్వోత్తమైన వృద్ధి సాధించిందన్నారు.

రాజకీయాలకు అతీతంగా టీడీఎఫ్​ పనిచేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ రాకముందు 6,600 మెగావాట్లు విద్యుత్ ఉంటే, ప్రస్తుతం 13,000 మెగావాట్లుగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఏడేళ్లలో రెండింతలు చేశామని మంత్రి ప్రశాంత్​ రెడ్డి తెలిపారు. పవర్ కట్​ల నుంచి.. సీఎం కేసీఆర్ దిశానిర్ధేశంలో విద్యుత్​ కోతల్లేని తెలంగాణగా మార్చామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిర్మాణ రంగంలో 65 శాతం, వ్యవసాయంలో 71శాతం, బ్యాంక్ ఇన్సూరెన్స్ రంగంలో 100శాతం, పరిశ్రమ రంగంలో 74.5శాతం, సేవా రంగంలో 120శాతం... మొత్తంగా జీఎస్డీపీ 117 శాతం వృద్ధి సాధించామన్నారు.

శాసనసభలో చర్చించాలి..

రైతులకు ఏ పంట పండిస్తే ఎంత లాభం ఉంటది, గిట్టుబాటు ధర ఉంటదా... డిమాండ్​ అండ్​ సప్లై మేరకు పండిస్తే బాగుంటుందనే విషయంపై రైతులకు అవగాహన రావాలి. దీనిపై శాసనసభలో కూడా చర్చించాలె. ఏ నెలలో ఏ పంట పండిస్తే మార్కెటింగ్​ ఉంటది అనే దానిపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. -వేముల ప్రశాంత్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి

రైతులు ఎంత ధాన్యం పండించాలి అనే అంశంపై ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా స్పష్టత ఇవ్వాలని తెలంగాణ డెవలప్​మెంట్​ ఫోరమ్​ ఉపాధ్యక్షురాలు ప్రీతిరెడ్డి సభావేధికగా విజ్ఞప్తి చేశారు. అవసరమైతే శాసనసభను సమావేశపరిచి పార్టీలకు అతీతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత మంత్రి ప్రశాంత్ రెడ్డి సైతం ఈ దిశగా రైతుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Dec 12, 2021, 9:12 PM IST

ABOUT THE AUTHOR

...view details