Pravallika Suicide Case Update :పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడిన ప్రవల్లిక ఆత్మహత్య కేసులో.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ప్రవల్లిక ఆత్మహత్యకు కారణమని.. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు వివరాలను వెల్లడించారు.
Pravallika Last Rites Complete : అశ్రునయనాల మధ్య ప్రవల్లికకు కన్నీటి వీడ్కోలు.. ముగిసిన అంత్యక్రియలు
Police Press Meet on Pravallika Suicide : వరంగల్ జిల్లా బిక్యానిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవల్లిక(Pravallika Suicide) వరంగల్ గీతాంజలి కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసింది. గతేడాది పోటీ పరీక్షల శిక్షణకు హైదరాబాద్ వచ్చింది. 15 రోజుల క్రితం చిక్కడపల్లి అశోక్‌నగర్‌లోని బృందావన్ లేడీస్ హాస్టల్లో చేరింది. శృతి, అక్షయ, సంధ్య, ప్రవల్లిక ఒకే గదిలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మిగిలిన ముగ్గురు భోజనానికి వెళ్లారు.
ఆ సమయంలో ప్రవల్లిక ఒక్కతే గదిలో ఉంది. మిగిలిన ముగ్గురు భోజనం ముగించుకొని గదికి వచ్చారు. గది తలుపునకు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో వారు తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఆమె ఉరేసుకుని ఉండటంతో.. చిక్కడపల్లి పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపు.. భారీ ఎత్తున జనం పోగయ్యారు. యువతి ఆత్మహత్య విషయం తెలియగానే స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు వసతి గృహం వద్ద ఆందోళన చేపట్టారని డీసీపీ వివరించారు.
Group2 Aspiring Student Pravallika Suicide :గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయడం వల్లే ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందంటూ.. శుక్రవారం రాత్రి నిరసన చేపట్టారన్నారు. ప్రవల్లిక వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకుందని.. మృతురాలి రూమ్మేట్ సంధ్యతో చెప్పించాకే ఆందోళనకారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో వెళ్లిపోయారన్నారు. నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టి.. అర్ధరాత్రి ప్రవల్లిక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించి ప్రవల్లిక గ్రామానికి పంపించామన్నారు.