రైతులకు ఆధునిక సాఫ్ట్వేర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై మెరుగైన సలహాలు ఇచ్చేందుకు పలు ప్రైవేటు సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ప్రతిమ అగ్రీ సర్వీసెస్ సంస్థ.. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వర్చువల్ విధానంలో ఈ అవగాహన ఒప్పందం యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు సమక్షంలో జరిగింది. ఈ అవగాహన ఒప్పంద పత్రాలపై విశ్వవిద్యాలయం తరఫున రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, ప్రతిమ అగ్రీ సర్వీసెస్ తరఫున ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి వి.రమణారావు సంతకాలు చేశారు.
రైతు సంక్షేమానికై ప్రతిమ అగ్రీ సర్వీసెస్ కృషి - Corona latest news
రైతు సంక్షేమానికై ప్రతిమ అగ్రీ సర్వీసెస్ కృషి చేస్తోంది. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Pratima Agri Services for farmer welfare
రానున్న రోజుల్లో "ఈ-రైతు" వెబ్‌సైట్ రూపొందించడం ద్వారా సాగుదారులకు వ్యవసాయ సూచనలు, సలహాలు అందించనున్నారు. వ్యవసాయ విద్య అభ్యసించిన గ్రాడ్యుయేట్లు, డిప్లోమా పూర్తి చేసిన పట్టభద్రులను ప్రతిమ అగ్రీ సర్వీసెస్ సంస్థ నియమించుకోనుంది. ఇరు సంస్థలు పరస్పరం సహకారంతో క్షేత్రస్థాయిలో రైతులకు మెరుగైన వ్యవసాయ సూచనలు, సలహాలు అందించడానికి కృషి చేస్తాయని ఆయా వర్గాలు తెలిపాయి.