కల్లుగీత వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర గీత పని వార్ల సంఘం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
కల్లు ఆహారంలో ఒక భాగం: వినోద్ - ఎన్నో రోగాలకు
తెలంగాణలో కల్లు ఆహారంలో ఒక భాగంగా ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
'కల్లు పానీయం ఆహారంలో ఒక భాగం'
ఎన్నో రోగాలకు ఔషధంలా ఉపయోగపడే కల్లుపై శాస్త్రీయ పరిశోధనలు చేయాలని వినోద్ కుమార్ అన్నారు. మారుతున్న వ్యాపార దృక్పథాలకు అనుగూణంగా కల్లుగీత కార్మికులు మార్కెటింగ్ మేళకువలు నేర్చుకొవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకానికి ప్రాధాన్యత నిస్తుందన్నారు. గీత పనివార్ల సంఘం ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.
ఇదీ చూడండి : ఏకదంతుడి కోసం ఏకమవుదాం.. మట్టి గణపతినే వాడుదాం