తెలంగాణ

telangana

ETV Bharat / state

Prajasangrama Yathra: బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా... ఎందుకంటే? - తెలంగాణ వార్తలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను(Prajasangrama Yathra latest news) తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ నెల 21న యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా..ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో వాయిదా వేసినట్లు భాజపా నేతలు తెలిపారు. త్వరలోనే ప్రజా సంగ్రామ యాత్ర(Prajasangrama Yathra latest news) తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

By

Published : Nov 13, 2021, 8:01 PM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్రను(Prajasangrama Yathra postpone)తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే ప్రజా సంగ్రామ యాత్ర(Prajasangrama Yathra latest news) తేదీని ప్రకటిస్తామని తెలిపారు. తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాష్ట్ర భాజపా నేతలు నిరంతరం పోరాటం చేస్తారని ఆ పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ మెడలు వంచేదాకా నిరసనలు, ఆందోళనలను ఉధృతం చేస్తామని భాజపా నేతలు పేర్కొన్నారు.

తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర సాగిన తీరు...

తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర(Prajasangrama Yathra) అగస్ట్‌ 28 నుంచి అక్టోబర్ 2వ వరకు 35 రోజుల పాటు సాగింది. తొలిరోజు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల చేసిన బండి సంజయ్(BJP state president Bandi Sanjay) అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న భాజపాను గ్రామీణ ప్రాంతాల్లోనూ పటిష్టం చేసి 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు పక్కా వ్యూహంతో ప్రజా సంగ్రామ యాత్ర సాగింది. ఈ పాదయాత్రలో తెరాస ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని, ఏడేళ్ల కాలంలో అనేక ప్రజా వ్యతిరేక విధానాలను తెరాస అవలంబించినట్లు తీవ్ర స్థాయిలో ప్రజల ముందు బండి సంజయ్ ఎండగట్టారు. 438 కిలోమీటర్ల మేర.. 8 జిల్లాల మీదుగా తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర(Prajasangrama Yathra) సాగింది. ఈ యాత్రలో భాగంగా 35 చోట్ల బహిరంగ సభలు జరుగగా ఆరుగురు కేంద్రమంత్రులతో పాటు 24 మంది జాతీయ నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. 35 రోజుల పాటు సాగిన ఈ యాత్ర అక్టోబర్ 2న హుస్నాబాద్‌లో ముగిసింది.

ఇదీ చదవండి:Kishan Reddy: కేసీఆర్.. అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపకండి: కిషన్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details