Praja Palana Telangana 2024 Today :రెండు రోజుల విరామం తర్వాత ప్రజా పాలన నేటి నుంచి మళ్లీ జరగనుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు రెండు విడతలుగా గ్రామ, వార్డు సదస్సులు ఉంటాయి. ఇప్పటికే 40 లక్షల 57 వేల 952 దరఖాస్తులు రాగా మరో 5 రోజులు ఉండటంతో వాటి సంఖ్య కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. దరఖాస్తుల తీరు, నిబంధనలపై పలు అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. పింఛన్లు, రైతుభరోసా కోసం ఇప్పటికే లబ్ధి పొందుతున్న వారు పథకాల కోసం మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు.
Telangana Praja Palana 2024: ప్రజాపాలన సదస్సులు ఇవాళ్టి నుంచి ఈనెల 6వరకు జరగనున్నాయి. గత నెల 28న ప్రారంభమైన ఆ కార్యక్రమానికి సెలవులతో రెండ్రోజుల విరామం ఏర్పడింది. గతనెల 28 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 868 గ్రామాలు, 8 వేల 697 మున్సిపల్ వార్డుల్లో సదస్సులు నిర్వహించారు. 6 గ్యారెంటీల పథకాలు సహా రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మూడు రోజుల్లో 40 లక్షల 57 వేల 592 దరఖాస్తులు రాగా రోజు రోజుకీ పెరుగుతున్నాయి.
ప్రజాపాలన దరఖాస్తు ఎలా నింపాలి? - ఏయే డాక్యుమెంట్లు అవసరం?
Huge Response Praja Palana in Telangana : తొలి రోజు 7 లక్షల 46 వేల 414, రెండో రోజు 8లక్షల 12 వేల 862, మూడో రోజు అత్యధికంగా 18 లక్షల 29 వేల దరఖాస్తులువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈనెల 6 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉండటంతో కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువగా మహాలక్ష్మి పథకంలోని గ్యాస్ సిలిండర్, 2,500, గృహజ్యోతి పథకంలోని 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.