Praja Palana Programme in Telangana :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం(Prajapalana Programme) ఉత్సాహంగా సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్లో అభయహస్తం దరఖాస్తులకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. దరఖాస్తులు సమర్పించేందుకు ఇవాళ ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది. ఈ క్రమంలో నిన్న ఒక్క రోజే 2 లక్షల 48 వేల 647 మంది ఆరు గ్యారంటీలు తమకు కావాలంటూ ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. నారాయణగూడలోని వార్డు కార్యాలయాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ రెడ్డితో కలిసి అధికారులు సందర్శించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి పాల్గొని దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వం అందిస్తున్న ఆరు గార్యెంటీ పథకాల్లో దళారులకు చోటు లేదు - ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
Minister Damodara Raja Narsimha In Sangareddy Prajapalana :కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా ప్రజలకు మెరుగైన సుపరిపాలనను చేరువ చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Raja Narsimha) తెలిపారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ పరిధి 17,18వ వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొమ్మిదిన్నర ఏళ్లుగా నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందని మంత్రి విమర్శించారు.
Prajapalana Applications: కామారెడ్డి జిల్లాలో సదాశివనగర్, గాంధారి మండలాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జీ జువ్వడి నర్సింగ రావు పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో రుద్రవరంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన వార్డు సదస్సును కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజా పాలన నోడల్ అధికారి శ్రీ దేవసేన, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి పరిశీలించారు. దరఖాస్తుదారులతో నోడల్ అధికారి మాట్లాడి ఏ ఏ పథకాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని తెలుసుకున్నారు.