తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజాపాలన'లో అధికారుల అలసత్వం - ఆగ్రహానికి గురవుతున్న జనం - కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు

Praja Palana Applications Issue Telangana : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో పలు ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభించిన రెండో రోజు తెల్లవారుజామునే ఆయా కౌంటర్ల వద్ద ప్రజలు బారులు తీరారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో సమయానికి అధికారులు వార్డుల్లో లేకపోవడంతో గంటలపాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా వచ్చిన అధికారుల చేతుల్లో దరఖాస్తు పత్రాలు లేకపోవడంతో అసహనంగా ప్రజలు వెనుదిరిగివెళ్లిపోయారు.

Praja Palana Applications Issue Telangana
Praja Palana Applications

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2023, 12:26 PM IST

Updated : Dec 29, 2023, 2:09 PM IST

'ప్రజాపాలన'లో అధికారుల అలసత్వం - ఆగ్రహానికి గురవుతున్న జనం

Praja Palana Applications Issue Telangana :రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్యారంటీల (Congress Six Guarantees) అభయ హస్త పథకం అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ఆగ్రహానికి గురవుతోంది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక అధికారుల తీరుతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిన రెండో రోజు తెల్లవారుజామునే ఆయా కౌంటర్ల వద్దకు ప్రజలు బారులు తీరారు. ఉదయం 8 గంటలకు రావాల్సిన అధికారులు పలు వార్డుల్లో ఆలస్యంగా రావడంతో ప్రజలకు ఎదురుచూపు తప్పలేదు. వచ్చిన అధికారులు తమ వెంట దరఖాస్తు పత్రాలు తీసుకురాకపోవడంతో నిరాశతో వెనుతిరిగారు.

Public Facing Abhaya Hastham Applications Issue :దరఖాస్తు పత్రాలు లేవని, పై అధికారులు ఇచ్చినప్పుడే వాటిని పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు ప్రజలకు తెలపడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు పత్రాలు లేకుంటే కౌంటర్​లో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. ఈ విషయంపై పురపాలక కమిషనర్ జగదీశ్వర్ గౌడ్​ను వివరణ కోరగా తెచ్చిన దరఖాస్తు పత్రాలు పూర్తిగా అయిపోయాయని, జిరాక్స్​లు తీయిస్తున్నామని తొందర్లోనే ఆయా కౌంటర్ల వద్దకు అందిస్తామని తెలిపారు.

ప్రజాపాలన కార్యక్రమంలో గలాటా - ఎంపీపీ, ప్రజల మధ్య వాగ్వాదం

Praja Palana Program Issue Telangana : మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం (Congress Government) అందించే ఆరు గ్యారెంటీలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని, జీహెచ్ఎంసీ (GHMC) అదనపు కమిషనర్ కిల్లు శివకుమార్ నాయుడు అన్నారు.ఆరు గ్యారంటీల పథకాలకు సంబంధించి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా, హిమాయత్​నగర్​ గాంధీ కుటీర్​లోని వార్డు కార్యాలయాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్​రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కిల్లు శివకుమార్ నాయుడు మాట్లాడారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు తొలి దఫా ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

Praja Palana Telangana 2023 :ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 8 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరు ఇబ్బందులకు గురికాకుండా ప్రతి వార్డు కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంచుతున్నామని, ప్రజలకు ఏదైనా అనుమానాలు ఉంటే హెల్ప్ డెస్క్ సిబ్బంది పరిష్కరిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని, నిజమైన లబ్ధిదారులకు పథకాలు వర్తిస్తాయని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ఆయన సూచించారు. కొన్ని చోట్ల దరఖాస్తులు బ్లాక్​లో అమ్ముతున్నారని దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదే వ్యవహారంలో ఇద్దరు, ముగ్గురిని పోలీసులకు కూడా అప్పజెప్పినట్లు తెలిపారు.

ప్రజాపాలనకు విశేష స్పందన- తొలిరోజు 7,46,414 అప్లికేషన్లు

రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమం - ఐదు గ్యారంటీల దరఖాస్తులు ఇచ్చేందుకు పోటెత్తిన జనం

Last Updated : Dec 29, 2023, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details