తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజాపాలన దరఖాస్తు ఎలా నింపాలి? - ఏయే డాక్యుమెంట్లు అవసరం? - ప్రజాపాలన అప్లికేషన్ 2023

Praja Palana Application Form Telangana 2023 : రాష్ట్రంలో 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం డిసెంబరు 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు పది రోజుల పాటు గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్ వార్డుల్లో జరగనుంది. ఈ పది రోజుల్లో గ్రామ సభలు ద్వారా ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తారు. ఇప్పటికే మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోంది. అలాగే మిగిలిన పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో కాంగ్రెస్ అభయ హస్తం అప్లికేషన్ ఫామ్​ను విడుదల చేశారు. ఈ దరఖాస్తు ఫామ్​ను ఎలా నింపాలి, అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటో తెలుసుకుందాం.

Praja Palana
Praja Palana Application Form Telangana 2023

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 6:20 AM IST

Praja Palana Application Form Telangana 2023 : ఈనెల 28వ తేదీ నుంచి కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఐదు పథకాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ అప్లికేషన్ ఫామ్​లు ఎక్కడ దొరుకుతాయి? ఎలా నింపాలి? అందుకోసం ఏమేం డాక్యుమెంట్లు కావాలి? అని ప్రజలు చాలా గందరగోళంలో ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం చాలా సింపుల్​గా ఐదు పథకాలకు ఒకే అప్లికేషన్​ను సిద్ధం చేసింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అప్లికేషన్ ఫామ్​ను విడుదల చేశారు. మరి ఈ ఫామ్​లో నింపాల్సిన వివరాలేంటో తెలుసుకుందామా?

ప్రజాపాలన దరఖాస్తు 1

Telangana Praja Palana Application Form 2023 :ఐదు పథకాలకు సంబంధించిన అప్లికేషన్​లో మొదట కుటుంబ వివరాలు నింపాల్సి ఉంటుంది. యజమాని పేరు, లింగం, కులం, పుట్టిన తేదీ వివరాలు, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబరును నింపాలి. ఏ వృత్తి చేస్తున్నారో దాని గురించి రాయాలి. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డులో ఉన్నట్లు చిరునామా రాయాలి.

ప్రజాపాలన దరఖాస్తు 2

How to Fill Praja Palana Application 2023 : ఐదు పథకాల్లో ఏ పథకం కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన బాక్స్​లో టిక్ కొట్టాలి. మొదటగా మహాలక్ష్మి పథకం, ఆ తర్వాత రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి, చేయూత ఈ పథకాలకు సంబంధించిన విషయాలను కింద ఒక్కొక్కటిగా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు నింపాలి.

ప్రజాపాలన దరఖాస్తు 3
  • మొదటిగా మహాలక్ష్మి పథకంలో ప్రతి నెల రూ.2500 ఆర్థిక సాయం కావాలంటే అక్కడ ఉన్న బాక్స్​లో టిక్ చేయాలి. ఆ తర్వాత రూ.500లకు గ్యాస్ సిలిండర్ కావాలంటే బాక్స్​లో టిక్ చేసి కింద ఇచ్చిన గ్యాస్ కలెక్షన్ నంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను రాయాలి.
  • రెండోది రైతు భరోసా పథకంలో మొదటగా రైతులకు ప్రతి ఏటా ఎకరానికి రూ.15000 కావాలంటే రైతు, కౌలు రైతు అనే రెండు బాక్సులు ఉన్నాయి. వాటిలో మీరు ఏ కోవకు చెందినవారో దానిలో టిక్ చేయాలి. పట్టాదారు పాసు పుస్తకం నంబర్లు రాయాలి. అలాగే సాగు చేస్తున్న భూమి వివరాలను సర్వే నంబరు, విస్తీర్ణం వంటి వివరాలు నింపాలి.

రైతు భరోసా పథకం రెండో నంబరులో వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12000 ఉన్న చోట మీరు వ్యవసాయ కూలీ అయితే టిక్ చేయాలి. అక్కడ కింద ఉపాధి హామీ కార్డు నంబరు వివరాలు రాయాలి.

  • మూడోది ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం బాక్సులో టిక్ చేయాలి. రెండో నంబరు అమరవీరులు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కావాలనుకునే వారు దిగువన ఉన్న అమరవీరుల కుటుంబం పక్కన ఉన్న బాక్సులో టిక్ చేయాలి. కింద అమరవీరుల పేరు, అమరులైన సంవత్సరం, ఎఫ్​ఐఆర్ నంబరు, డెత్ సర్టిఫికేట్ నంబరును రాయాలి. దిగువన ఇచ్చిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అనే దాని దగ్గర అవును, కాదు అనేది రాయాలి. అవును అయితే సంబంధిత ఎఫ్​ఐఆర్ నంబరు, సంవత్సరం రాయాలి. ఒక వేళ జైలుకు వెళ్లినచో వాటి వివరాలు పొందుపర్చాలి. జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు రాయాలి.
  • నాలుగోది గృహ జ్యోతి పథకంలో కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావాలంటే మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం దిగువన ఇచ్చిన బాక్సుల్లో టిక్ చేయాలి. అలాగే గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్యను రాయాలి.
  • ఐదో గ్యారంటీ చేయూత పథకం కింద నెలకు రూ.4000, దివ్యాంగుల పింఛన్ రూ.6000 పొందేందుకు ఈ కింది వివరాలను తెలపాలి. అయితే ఇక్కడ ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయనవసరం లేదు. కొత్తగా పింఛన్ కావాలంటే దివ్యాంగులు అయితే టిక్ చేసి సదరం సర్టిఫికేట్ నంబరు రాయాలి. ఇతరులు అయితే వృద్ధాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలిసిస్ బాధితులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, బీడీ కార్మికులు జీవన భృతి, ఫైలేరియా బాధితులు, ఒంటరి మహిళ జీవన భృతి, బీడీ టెకేదారు జీవన భృతి కావాలనే వారు సంబంధిత బాక్సుల్లో టిక్ చేయాలి.
ప్రజాపాలన దరఖాస్తు 4

Praja Palana Application Detalis 2023 : ఈ వివరాలు అన్ని సమర్పించిన తర్వాత అన్నీ వాస్తవమని ధ్రువీకరిస్తున్నానని సంతకం లేదా వేలి ముద్ర రాసి, పేరు, తేదీని రాయాలి. ప్రజాపాలన దరఖాస్తుకు సమర్పించవలసిన ప్రతులు ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ జత చేయాలి. ఇలా నింపిన తర్వాత అక్కడ ఉన్న అధికారికి ఇస్తే వాళ్లు అడిగిన వివరాలు మీరు చెబితే, చెక్ చేసి దరఖాస్తుదారుడు ఏయే పథకాలకు అర్హుడని నిర్ణయిస్తారు. ఇలా దరఖాస్తు చివరలో ఉన్న రశీదును నింపి, సంతకం చేసి ప్రభుత్వ ముద్ర వేసి దరఖాస్తుదారునికి ఇస్తారు.

ప్రజాపాలన దరఖాస్తు 5

ప్రజాపాలన దరఖాస్తు ఫారం ఇదే - ఐదు పథకాలకు ఒకే అప్లికేషన్

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా కాంగ్రెస్ గ్యారెంటీలు ప్రారంభం - సద్వినియోగం చేసుకోవాలన్న నేతలు

ABOUT THE AUTHOR

...view details