ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రజా ఏక్తా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి బోనాల శ్రీనివాస్ ఆరోపించారు. తాను గెలిస్తే ప్రజా సమస్యల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
'ఉద్యోగ, నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు' - తెలంగాణ వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీలతో పాటు చిన్న చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను గెలిస్తే ప్రజా సమస్యల కోసం కృషి చేస్తామని ప్రజా ఏక్తా పార్టీ అభ్యర్థి బోనాల శ్రీనివాస్ హామీ ఇచ్చారు.
'ఉద్యోగ, నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు'
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే.... ప్రభుత్వం ఇచ్చే తన జీతం మొత్తం సమస్యల పరిష్కారం కోసమే ఖర్చు చేస్తానని ఆయన ప్రకటించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:ప్రశ్నించే గొంతుక కాదు... పరిష్కరించే గొంతుక కావాలి: ఎర్రబెల్లి