తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజా దర్బార్ ఇకపై ప్రజావాణి - టైమింగ్స్ ఇవే

Praja Darbar Renamed As Praja Vani : రాష్ట్రంలో జ్యోతిరావు పూలే ప్రజాభవన్​లో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్​ను ఇక నుంచి ప్రజావాణిగా పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఈ ప్రజావాణిని ప్రతి మంగళ, శుక్ర వారాల్లో రెండు రోజులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని ప్రకటించారు.

Praja Darbar Renames As Praja Vani
Praja Vani

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 1:57 PM IST

Praja Darbar Renamed As Praja Vani :రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే, ప్రజా పాలన అందించే లక్ష్యంతో చేపట్టినప్రజా దర్బార్‌ను ఇకపై ప్రజావాణిగా పిలవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ఆదేశించారు. ఈ ప్రజావాణిని ఇకనుంచి వారంలో రెండు రోజులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ మేరకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా వాణికి వేళలను కూడా నిర్దేశించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలలోపు ప్రజావాణి వద్దకు చేరుకున్నవారికి అవకాశం ఇవ్వనున్నారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూ ఏర్పాటు, ప్రజల సౌకర్యార్థం తాగు నీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని అధికారులను సీఎం రేవంత్​ ఆదేశించారు.

CM Revanth Reddy Key Decision On Praja Vani: ఈ కార్యక్రమంలో జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. అనంతరం వారు రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలు రాష్ట్ర స్థాయి అధికారులకు పంపుతారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 8వ తేదీన ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో ఇప్పటి వరకూ దాదాపు 5000 వినతులను ప్రజల నుంచి స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులోనూ ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వాటి నిర్మాణం, పెన్షన్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.

Praja Vani in Telangana Timings :గత ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం మొక్కుబడిగా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలు కోరుతున్నారు. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు వస్తేనే తమ సమస్యలకు పరిష్కారాలు స్పష్టం అవుతాయని ప్రజలు చెబుతున్నారు. దిగువస్థాయి అధికారులతో ఆశించిన ప్రయోజనం దక్కదని అంటున్నారు. అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలు, వాటికి లభించిన పరిష్కాలపై తరచూ సమీక్ష నిర్వహించాలని కూడా ప్రజలు కోరుతున్నారు.

రెండో రోజు అదే ఉత్సాహం - ప్రజాదర్బార్​కు విశేష స్పందన

Congress Government in Telangana 2023 : తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో ముఖాముఖీ అయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రజా దర్బార్​గా పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం, దీన్ని ఇప్పుడు ప్రజావాణిగా పేరు మార్చింది. ప్రజా దర్బార్ అంటే రాజరికపు పోకడలకు గుర్తుగా ఉందనో, లేక మరే ఇతర కారణంతోనో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రజావాణి కార్యక్రమాన్ని వారమంతా కాకుండా కేవలం వారానికి రెండు రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రజా దర్బార్​కు అనూహ్య స్పందన - తమ సమస్యలను సీఎంకు విన్నవించుకున్న ప్రజలు

ప్రజాదర్బార్​కు విశేష స్పందన- సేవను మించిన తృప్తి లేదంటూ సీఎం ఎమోషనల్​ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details