Prahlad Joshi on Attack on Aravind House: తెలంగాణలో భాజపా ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే భాజపా నేతల ఇళ్లపై కేసీఆర్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై కేంద్రమంత్రి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న భాజపా.. తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని ప్రహ్లాద్ జోషి అన్నారు. భాజపాలోకి కేటీఆర్, కవిత ఎవరు వచ్చినా సాధరంగా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి హైదరాబాద్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.
'భాజపాలోకి కేటీఆర్, కవిత వచ్చినా సాధరంగా ఆహ్వానిస్తాం' - ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి
Prahlad Joshi on Attack on Aravind House: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో భాజపా ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేకే ఇళ్లపై కేసీఆర్ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోందని విమర్శించారు. భాజపాలోకి కేటీఆర్, కవిత ఎవరు వచ్చినా సాధరంగా ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వస్తే సీఎం కేసీఆర్ ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు. తను చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ అలా చేస్తున్నారా అని ధ్వజమెత్తారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్న ఆయన.. సీఎం కేసీఆర్ అబద్ధాలకు అడ్డులేకుండా పోతోందని పేర్కొన్నారు. గనులపై ఒడిశా రాష్ట్రం మంచి లాభాన్ని గడిస్తుంటే.. తెలంగాణలో గనుల నుంచి వచ్చే రాబడిని సద్వినియోగం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. పీఎం ఆవాస్ యోజన పథకాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోతోందని ప్రహ్లాద్ జోషి అన్నారు.
ఇవీ చదవండి: