ఎన్నికల్లో తెరాస విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. ఫెడరల్ ప్రంట్ ప్రగతి భవన్‌కే పరిమితమని ఆ తర్వాత ఫాం హౌస్‌కు తరలిస్తారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో తక్కువ పోలింగ్ నమోదు కావడానికి ఓవైసీ పట్ల వ్యతిరేకతనే కారణమన్నారు. తాము బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బు పార్టీ నిధి అని చెప్పారు. ప్రతి పైసాకి పద్దులు ఉన్నాయని వివరించారు. బ్యాంకు అధికారులు సైతం తమకు క్లీన్ చిట్ ఇచ్చారని స్పష్టం చేశారు.
ప్రగతి భవన్‌ను ఫాం హౌస్‌కు తరలిస్తారు: కె.లక్ష్మణ్
ఎన్నికల్లో తెరాస వందల కోట్ల రూపాయలను వెదజల్లిందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. తెరాస, భాజపా మధ్యే పోటీ అని స్పష్టం చేశారు.
ఓవైసీపై వ్యతిరేకత తోనే పోలింగ్ శాతం తగ్గింది : కె.లక్ష్మణ్