ఉస్మానియా మెడికల్ కళాశాల వైద్యులకు హైదరాబాద్కు చెందిన మహేశ్వరం వైద్య కళాశాల నిర్వాహకులు పీపీఈ కిట్స్, ఎన్ 95 మాస్కులను అందజేశారు. కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తమ వంతు బాధ్యతగా వైద్యుల ప్రాణాలను కాపాడేందుకు పీపీఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వైద్య కళాశాల నిర్వాహకులు తెలిపారు.
ఉస్మానియా మెడికల్ కాలేజీకి పీపీఈ కిట్ల పంపిణీ - hyderabad news
హైదరాబాద్కు చెందిన మహేశ్వరం మెడికల్ కళాశాల నిర్వాహకులు ఉస్మానియా వైద్య కళాశాల వైద్యులకు పీపీఈ కిట్లు, మాస్కులను అందించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రి వైద్యులకు పీపీఈ కిట్లు అవసరముంటే తమను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
ppe kits distributed to osmaniya medical college doctors
కోటి ఉస్మానియా మెడికల్ కళాశాల వైద్యుల కోసం 500 పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులను అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ కొవిడ్ ఆస్పత్రి వైద్యులకు పీపీఈ కిట్లు అవసరముంటే తమను సంప్రదించాలని మహేశ్వరం మెడికల్ కళాశాల నిర్వాహకులు పేర్కొన్నారు.