వైద్యులకు పీపీఈ కిట్స్ పంచిన ప్యూర్ స్వర వేదిక - PPE KITS DISTRIBUTED IN MAHAVEER HOSPITAL
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని మహావీర్ ఆస్పత్రిలో సుమారు 500 పీపీఈ కిట్స్‌ని ప్యూర్ స్వర వేదిక పంపిణీ చేసింది.
![వైద్యులకు పీపీఈ కిట్స్ పంచిన ప్యూర్ స్వర వేదిక PPE KITS DISTRIBUTED IN MAHAVEER HOSPITAL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6934575-287-6934575-1587802172422.jpg)
వైద్యులకు పీపీఈ కిట్స్ పంచిన ప్యూర్ స్వర వేదిక
ప్యూర్ స్వర వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని మహావీర్ ఆస్పత్రి యాజమాన్యానికి సుమారు 500 పీపీఈ కిట్స్ అందించారు. గత కొన్నేళ్లుగా పేద ప్రజలకు ఎంతో సేవ అందిస్తున్నామని ప్యూర్ స్వర వేదిక మేనేజింగ్ డైరెక్టర్ సంధ్య తెలిపారు. ఆపత్కాల సమయంలో వైద్యులు, సిబ్బందికి చిరు కానుకగా కిట్లు అందిస్తున్నామన్నారు. ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా ఆదుకోవడంలో ప్యూర్ స్వర వేదిక ముందుంటుందని సంధ్య కొనియాడారు.
ఇదీ చదవండి:కరోనాపై పోలీసుల ప్రాంక్.. వీడియో వైరల్
TAGGED:
500 పీపీఈ కిట్ల పంపిణీ