తెలంగాణ

telangana

ETV Bharat / state

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు - Cmd prabhakara rao on power restoration

విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని ట్రాన్స్​కో, జెన్కో సీఎండీ ప్రభాకరావు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం అదనపు హెల్ప్​లైన్​లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు
యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు

By

Published : Oct 21, 2020, 7:20 PM IST

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని ట్రాన్స్​కో, జెన్కో సీఎండీ ప్రభాకరావు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం అదనపు హెల్ప్​లైన్​లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, హెచ్​టీఎల్టీ లైన్లు దెబ్బతిని అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని సీఎండీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు.

ఉన్నతస్థాయి సమావేశం...

ఈసందర్భంగా అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ విద్యుత్ పునరుద్ధరణ పనులు సమర్థంగా నిర్వహిస్తున్నామన్నామని సీఎండీ వెల్లడించారు. పనులను పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను ఏర్పాటు చేశామన్నారు.

టీఎస్ఎస్పీడీసీఎల్ ఏరియా నోడల్ అధికారి- 9440813856, టీఎస్ఎన్పీడీసీఎల్ నోడల్ అధికారి- 9440811210, టీఎస్ ట్రాన్స్​కో రాష్ట్ర నోడల్ అధికారి- 9491398550లకు ప్రజలు ఫోన్ చేసి తమ సమస్యలు వివరిస్తే... వాటిని పరిష్కరిస్తారన్నారు.

ప్రత్యేక కంట్రోల్ రూం...

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామన్నారు. 1912 నంబర్​తో పాటు టీఎస్ఎస్పీడీసీఎల్- 7382072104, 7382072106, 7382071574, టీఎస్ఎన్పీడీసీఎల్- 9440811244, 9440811245లకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. తడిసివున్న విద్యుత్ స్థంబాలను, వేలాడే ఎలక్ట్రిక్ వైర్లను తాకవద్దని, ఎక్కడైనా వైర్లు తెగిపడితే... విద్యుత్ శాఖ సిబ్బందికి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:రామాంతపూర్​లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్​రెడ్డి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details