తుని మండలంలో డ్రోన్ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
అల్పపీడనం కారణంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిన గ్రామాలకు డ్రోన్ సహాయంతో విద్యుత్తు పునరుద్ధరణ పనులు చేపట్టారు. మండలంలోని ఎన్.ఎస్.వెంకట నగరం గ్రామానికి విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. కొలిమేరు - ఎన్.ఎస్. వెంకట నగరం మధ్యలో తాండవ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అధికారులు డ్రోన్లో వైర్లను ఆ గట్టు నుంచి ఈ గట్టుకు తీసుకొచ్చి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

తుని మండలంలో డ్రోన్ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ
.
తుని మండలంలో డ్రోన్ ద్వారా విద్యుత్ పునరుద్ధరణ