Power Point Presentation on Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు నేపథ్యం, వ్యయం, మేడిగడ్డ, అన్నారం ఆనకట్టల సమస్యలు, పరిష్కారంతో పాటు ప్రాణహిత-చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) రీడిజైనింగ్ వల్ల కలిగిన లాభనష్టాలను రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబర్పల్లి సమీపంలోని లక్ష్మీ ఆనకట్ట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపాదించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం ఈఎన్సీ మురళీధర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వీరి సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగిన లాభనష్టాలు, కొత్తఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు సహా అన్ని అంశాలను పవర్‌పాయింట్(Power Point Presentation) ప్రజెంటేషన్‌లో ఈఎన్సీ మురళీధర్ ప్రస్తావిస్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేస్తాం : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Kaleshwaram Project :ప్రాజెక్టు నిర్వహణ కోసం తీసుకున్న రుణాలు, చెల్లింపులు, అవసరమైన విద్యుత్ తదితర అంశాలను ఈఎన్సీ వివరించారు. ఐదేళ్లలో 173 టీఎంసీ(TMC)లు మాత్రమే లిఫ్ట్ చేశారని మురళీధర్ తెలిపారు. 2 టీఎంసీలు ఎత్తి పోసేందుకే దాదాపు 5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమని వివరించారు. గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత ప్రాజెక్టు కోసం ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పనులు కాళేశ్వరం చేపట్టిన తర్వాత వ్యయం వాటి వినియోగాన్ని వివరించారు.