తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు - ts news

Power Peak Demand: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోతోంది. రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధికంగా 13,857 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. వ్యవసాయం, పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు వేసవి కూడా కావడంతో డిమాండ్‌ భారీగా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

Power Peak Demand: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు
Power Peak Demand: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు

By

Published : Mar 28, 2022, 8:31 PM IST

Power Peak Demand: రాష్ట్రంలో భారీగా విద్యుత్ వినియోగం పెరిగిపోతోంది. ఇవాళ సాయంత్రం 3.54 నిమిషాలకు 13,857 మెగా వాట్ల విద్యుత్ వినియోగం పెరిగినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. ఇవాళ నమోదైన విద్యుత్ వినియోగం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికమని అధికారులు భావిస్తున్నారు. 3 రోజుల క్రితం 13,742 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన వ్యవసాయం, పరిశ్రమలు,నీటిపారుదల ప్రాజెక్టులకు విద్యుత్ డిమాండ్ పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఒకటి రెండు రోజుల్లోనే 14,000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 18,000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ వచ్చిన సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్​ను సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు నిరంతరం పని చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details