తెలంగాణ

telangana

ETV Bharat / state

అంధకారంలో రాజధాని.. 139 ట్రాన్స్​ఫార్మర్లలో కరెంటు నిలిపివేత

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల వల్ల నీట మునిగిన కాలనీల్లో జరుగుతున్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి పరిశీలించారు. వరద నీటి వలన అత్యధికంగా ప్రభావితమైన హైదరాబాద్ సౌత్, సెంట్రల్ సర్కిళ్ల పరిధిలోని వివిధ కాలనీల్లో ఎస్సీడీసీఎల్ సీఎండీ పర్యటించారు. వర్షం ప్రభావం వల్ల చెడిపోయిన, దెబ్బ తిన్న విద్యుత్ సామగ్రిని ఎస్పీడీసీఎల్ సంస్థ తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Power outages in 139 transformers in Hyderabad
Power outages in 139 transformers in Hyderabad

By

Published : Oct 20, 2020, 9:02 AM IST

గ్రేటర్​లో వర్షాలు-వరద ఇబ్బందులు ఇంకా తొలగడం లేదు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి.. విద్యుత్ పునరుద్దరణ పనులు జరుగుతున్న పరిస్థితిని పర్యవేక్షించారు. హఫీజ్ బాబానగర్​లో 42 విద్యుత్ స్తంబాలు, 20 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నాయని వెల్లడించారు. నదీమ్ కాలనీలో 22 విద్యుత్ స్థంబాలు, 7 పంపిణి ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర పరిధిలో అపార్ట్మెంట్ సెల్లార్లు, వీధుల్లో ముంపు కారణంగా 139 ట్రాన్స్ ఫార్మర్లలో సప్లయ్ నిలిపివేశామని పేర్కొన్నారు. వరద నీటి ఉద్ధృతి తగ్గగానే సరఫరా పునరుద్ధరిస్తామని అన్నారు.

అందుబాటులో బృందాలు

రాబోవు రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నదనే హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 189 సెక్షన్ స్థాయి డిజాస్టర్ మేనేజ్​మెంట్ బృందాలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒక్కొక్క డిజాస్టర్ మేనేజ్​మెంట్ బృందంలో 25 మంది సుశిక్షితులైన సిబ్బంది ఉంటారని చెప్పారు. విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా ఉండేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.

సొంత ఖర్చుతో...

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, చెడిపోయిన, దెబ్బ తిన్న విద్యుత్ సామగ్రిని ఎస్పీడీసీఎల్ సంస్థ తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. వినియోగదారులు ఎవరికీ ఎలాంటి డబ్బు ఇవ్వనవసరం లేదని తెలిపారు. ఒకవేళ ఎవరైనా విద్యుత్ సామగ్రి పేర డబ్బు డిమాండ్ చేస్తే 100 / 1912 కు ఫోన్ చేసి చీఫ్ జనరల్ మేనేజర్లకు పూర్తి వివరాలు మెసేజ్ చేయాలని సూచించారు. వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

  • సీజీఎం మెట్రో జోన్ -9440813836
  • సీజీఎం రంగారెడ్డి జోన్-9440813842
  • సీజీఎం రూరల్ జోన్- 8331998335
  • సీజీఎం మేడ్చల్ జోన్- 8331998336

పైన తెలిపిన ఫోన్ నంబర్లకు సమచారారం ఇవ్వాలని సూచించారు. వర్షం నీరు నిల్వ ఉన్నచోట, వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ వినియోగదారులు, సాధారణ ప్రజలు విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ ఫార్మర్లు వంటివి ఎట్టి పరిస్థితుల్లో తాకొద్దని తెలిపారు. విద్యుత్ సంబంధిత అత్యవసర పరిస్థితులు ఏర్పడితే సంస్థ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఇళ్ల బయట ఉన్నా, అపార్ట్మెంట్ సెల్లార్లలోని స్విచ్ బోర్డులను వాడేప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

విద్యుత్​కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 / 100 స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్​తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106, 7382071574 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. టీఎస్​ఎస్​పీడీసీఎల్​ మొబైల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సీఎండీ వినియోదారులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details