నూతన సచివాలయం, ప్రగతిభవన్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా నూతన సచివాలయం నిర్మాణం చేస్తామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని... ప్రతిపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొట్టారని తెలిపారు.
వ్యవసాయం దండగ అని, 24 గంటల విద్యుత్ ఇస్తామంటే వద్దని ధర్నాలు చేయడం ఇలా ప్రజల సంక్షేమం కోసం ఏ పథకాన్ని ప్రవేశ పెడుతున్నా ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, అందుకే బడ్జెట్లో అధిక నిధులు కేటాయించామని చెప్పారు. గతంలో ఉపాధి లేక వలస వెళ్లిన వారంతా సొంతూళ్లకు వస్తున్నారన్నారు. తెరాస సర్కారు ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తోందని... ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జగదీశ్ రెడ్డి అన్నారు.