తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎంపీ రేవంత్​ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి' - demand

ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావుపై ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. రేవంత్​ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

Power

By

Published : Aug 30, 2019, 1:41 PM IST

ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుపై ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తొలుత ఉద్యోగుల ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినందున విద్యుత్​ సౌధా లోపలే నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు షరతులతో అనుమతించడం వల్ల గన్​పార్క్​ వరకు ర్యాలీ నిర్వహించారు. రేవంత్​ వ్యాఖ్యలను ఉద్యోగ సంఘాల నేతలు ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎంపీ రేవంత్​ రెడ్డి వెంటనే సీఎండీ ప్రభాకర్​ రావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

'ఎంపీ రేవంత్​ రెడ్డి క్షమాపణ చెప్పాలి'

ABOUT THE AUTHOR

...view details