ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాల్లో సబ్స్టేషన్లలోకిి వరద నీరు రాగా.. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. నగర పరిధిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్లు 15, 11కేవీ ఫీడర్స్ 686 మరమ్మత్తుకు గురయ్యాయి. కాగా.. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేపట్టారు.
తెగిపడిన విద్యుత్ తీగలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత - నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలు తెగిపడటం, స్థంభాలు పక్కకు ఒరగడం, సబ్‌స్టేషన్లలోకి నీళ్లు రావడం వల్ల.. విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. మరమ్మత్తులు చేసి.. విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్నారు.
![తెగిపడిన విద్యుత్ తీగలు.. విద్యుత్ సరఫరా నిలిపివేత Power Distribution Problems In hyderabad Due to heavy rains](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9179083-23-9179083-1602729167636.jpg)
ఇప్పటి వరకు 33/11 కేవీ సబ్‌స్టేషన్లన్నీ పూర్తిగా మరమ్మత్తులు చేశారు. 686 సబ్స్టేషన్లలో.. 671 పునరుద్దరించారు. ఇంకా 15 సబ్స్టేషన్లు రిపేర్ చేయాల్సి ఉన్నాయి. మొత్త 59 డీటీఆర్లు మరమ్మత్తులకు గురి కాగా.. 54 మరమ్మత్తులు చేశారు. నగర పరిధిలో 312 విద్యుత్ స్థంభాలు వర్షం విధ్వంసానికి ధ్వంసమయ్యాయి. వాటిలో 104 మరమ్మత్తులు కాగా.. 94 స్థంభాలు కొత్తవి ఏర్పాటు చేశారు. ఇంకా 10 పునరుద్ధరించాల్సి ఉంది. ఎల్టీ విభాగంలో మొత్తం 208 స్థంభాలు ధ్వంసం కాగా.. 155 స్థంభాలు మరమ్మత్తులు చేశారు. ఇంకా 53 స్థంభాలు మరమ్మత్తులు చేయాల్సి ఉంది. వీలైనంత త్వరగా విద్యుత్ పునరుద్ధరిస్తామని.. ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. విద్యుత్ వైర్లు, స్థంభాలు ముట్టుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఇవీచూడండి:భారీ వర్షాలు... కోతకొచ్చిన పంట నీటిపాలు