భాగ్యనగరంలో మెట్రో రైలు ప్రయాణికులకు మొబైల్ పవర్ బ్యాంక్‌లు అందుబాటులోకి వచ్చాయి. స్టేషన్లలో వీటిని అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చు. ప్రస్తుతం 20 స్టేషన్లలో ప్రత్యేక కియోస్క్‌ల ద్వారా వీటిని అందుబాటులో ఉంచారు. క్రమంగా అన్ని స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.
ప్లగ్ అనే సంస్థ మెట్రో సౌజన్యంతో కలిసి వీటిని ఏర్పాటు చేసింది. రూ.199 డిపాజిట్ చేసి పవర్‌బ్యాంక్ తీసుకెళ్లొచ్చు. గంటకు రూ.3 కనీస అద్దెగా నిర్ణయించారు. 24 గంటల వరకు రూ.9, ఆ తర్వాత రోజు రూ.9 చొప్పున ఛార్జీ వసూలు చేస్తారు. ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు.