తెలంగాణ

telangana

ETV Bharat / state

కులోన్మాద హత్యలను నివారించాలి: మహిళా సంఘాలు - కులోన్మాద హత్యలపై మహిళా సంఘాల భేటీ

సమాజంలో కులోన్మాద హత్యలను నివారించాల్సిన అవసరం ఉందని మహిళా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో పీవోడబ్ల్యూ, పీవైఎల్, పీడీఎస్​యూ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు - కులోన్మాద హత్యలు అంశంపై సదస్సు నిర్వహించాయి.

కులోన్మాద హత్యలను నివారించాలి: మహిళా సంఘాలు
కులోన్మాద హత్యలను నివారించాలి: మహిళా సంఘాలు

By

Published : Sep 29, 2020, 8:02 PM IST

అగ్రవర్ణాల ఆధిపత్యం, ఆర్థిక పునాదులపై ఆధారపడి సమాజాన్ని నడిపించే శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పేర్కొన్నారు. హైదరాబాద్ విద్యానగర్​లోని మాక్స్ భవన్​లో పీవోడబ్ల్యూ, పీవైఎల్, పీడీఎస్​యూ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు - కులోన్మాద హత్యలు అంశంపై సదస్సు నిర్వహించాయి.

సమాజంలో కులాంతర వివాహం చేసుకునే వ్యక్తులకు రక్షణ కరవైందని ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. మతం, కులం, అనువాదాన్ని నిలబెట్టుకోవడానికి కొందరు చేస్తున్న కృషిని కూకటివేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇదీ చదవండి:హేమంత్ హత్య కేసు నిందితులకు పోలీసు కస్టడీ

ABOUT THE AUTHOR

...view details