రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన కొత్త వైద్య, నర్సింగ్ కళాశాలకు ఉద్యోగాలు మంజూరు చేసింది. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం వైద్యకళాశాలలకు ఒక్కో కళాశాలకు... 1001 చొప్పున ఏడు వైద్య కళాశాలలకు 7007 పోస్టులు ప్రకటించింది.
ప్రొఫెసర్లు, వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర జాబ్స్ ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. 13 కొత్త వాటితోపాటు జగిత్యాల, గాంధీ నర్సింగ్ కళాశాలలకు పోస్టులు మంజూరు చేశారు.