JNTU exams postponed: జేఎన్టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా - తెలంగాణ వార్తలు
08:43 September 27
జేఎన్టీయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా
జేఎన్టీయూ(JNTU) పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా(JNTU exams postponed) పడ్డాయి. వర్షాల కారణంగా ఇవాళ్టి పరీక్షలను వాయిదా వేసినట్లు జేఎన్టీయూ ప్రకటించింది. ఇవాళ జరగాల్సిన బీటెక్(B.tech exams postponed), ఫార్మసీ(pharmacy exams postponed) పరీక్షలను వాయిదా వేస్తూ జేఎన్టీయూ నిర్ణయం తీసుకుంది.
వాయిదా పడిన పరీక్షల షెడ్యూలు త్వరలో ఖరారు చేయనున్నట్లు వెల్లడించింది. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:TS Inter 1st year Exams: అక్టోబరు 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు