ఈనెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన ఓయూ పరీక్షలు వాయిదా - ఓయూ పరీక్షలు వాయిదా
20:22 October 18
ఈనెల 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన ఓయూ పరీక్షలు వాయిదా
ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో సోమవారం నుంచి ఈనెల 21 వరకు జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. సోమవారం నుంచి పీజీ పరీక్షలు జరగాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా ఈనెల 19, 20, 21న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్టు పరీక్షల విభాగం కంట్రోలర్ తెలిపారు. ఈనెల 22 నుంచి జరగాల్సిన పరీక్షలు షెడ్యూలు ప్రకారం యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'మ్యాన్ హోల్స్ సమస్యలు ఎప్పటికప్పడే పరిష్కరించండి'