జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇందూ టెక్ జోన్ ఛార్జ్ షీట్‌పై కూడా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. జగన్‌పై అభియోగాల నమోదు కోసం విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. పెన్నా ఛార్జ్ షీట్లో ప్రతాప్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్, అభియోగాల నమోదుపై ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు జరిగాయి. మరిన్ని వాదనల కోసం విచారణను న్యాయస్థానం ఈనెల 20కి వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించిన ఛార్జ్ షీట్‌పై విచారణ ఈనెల 24కి వాయిదా పడింది.
ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ వాయిదా - ap news
ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసుపై.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఇందూ టెక్ జోన్ కేసులో జగన్‌పై నమోదైన అభియోగాలపై విచారణను న్యాయస్థానం ఈ నెల 20కి వాయిదా వేసింది.
ఏపీ వార్తలు