సచివాలయ కూల్చివేతల పరిశీలనకు అనుమతించాలన్న కాంగ్రెస్ పిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు... తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాంగ్రెస్ నేతలు రేవంత్, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్, కొండా విశ్వేశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తమ దరఖాస్తులపై డీజీపీ, సీపీ స్పందించట్లేదని పిల్లో నేతలు పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల దరఖాస్తులపై ఏం చేశారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఏజీ క్వారంటైన్‌లో ఉన్నందున 2 వారాల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
సచివాలయ కూల్చివేతలపై కాంగ్రెస్ పిల్ విచారణ 2వారాలకు వాయిదా - కాంగ్రెస్ పిల్‌పై విచారణ
12:25 August 10
సచివాలయ కూల్చివేతలపై కాంగ్రెస్ పిల్ విచారణ 2వారాలకు వాయిదా
పొరపాటున కూలిందా లేక....
ఆలయం, మసీదు పొరపాటున కూలినట్లు ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ నేతలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పొరపాటున జరిగిందా ? ఉద్దేశపూర్వకంగానే కూల్చారో పరిశీలిస్తామని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దర్యాప్తు చేసే అధికారం ప్రజాప్రతినిధులకు లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై విచారణ జరపాలని పురావస్తుశాఖను కోరడానికి అడ్డంకి ఏమిటని ప్రశ్నిస్తూ... కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చూడండి : మానేరులోకి చేపపిల్లలు.. వదిలిన మంత్రులు తలసాని, గంగుల