KRMB:రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన వాయిదా - telangana varthalu
20:06 August 04
రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన వాయిదా
కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన వాయిదా పడింది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన తేదీని తర్వాత వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ తెలిపింది.
తెలుగు అధికారులు ఎవరూ లేకుండా పర్యటించాలని ఎన్జీటీ ఆదేశంతో కృష్ణా బోర్డు బృందం పర్యటించేందుకు సిద్ధమైంది. తెలంగాణ అధికారి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో పిటిషన్ వేసింది. తనిఖీ బృందంలో సీడబ్ల్యూసీలో పనిచేస్తున్న దేవేందర్‌రావు పేరును చేర్చడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ.. తెలుగు వ్యక్తులు లేకుండా వెళ్లాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. ఈనెల 9న నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. తాజాగా పర్యటన వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
సంబంధిత కథనం:రేపు రాయలసీమ ఎత్తిపోతల పర్యటనకు కృష్ణా బోర్డు బృందం