రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా, మండల వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు, గణాంక అధికారులు, రైతు బంధు సమితి ప్రతినిధులతో దృశ్యమాద్యమ సమీక్ష ఉండగా అది వాయిదా పడింది.
కలెక్టర్లతో సీఎం కేసీఆర్ దృశ్యమాద్యమ సమీక్ష వాయిదా
కలెక్టర్లతో సీఎం కేసీఆర్ దృశ్యమాద్యమ సమీక్ష వాయిదా పడింది. వ్యవసాయ అధికారులు, రైతుబంధు సమితి అధ్యక్షులతో సమీక్షను వాయిదా వేశారు.
కలెక్టర్లతో సీఎం కేసీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష వాయిదా
సమగ్ర వ్యవసాయ విధానం రూపకల్పనలో భాగంగా ఇప్పటికే సీఎం రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులతో చర్చించాలని నిర్ణయించడం వల్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ బుధవారం అన్నిజిల్లాల కలెక్టర్లకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 2 తర్వాత ఈ సమావేశం జరగాల్సి ఉంది.
ఇదీ చదవండి:తగ్గని విషవాయువు ప్రభావం