తెలంగాణ

telangana

ETV Bharat / state

'టెక్నాలజీకి అనుగుణంగా పోస్టల్​ ఉద్యోగులు మారాలి'

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోస్టల్ ఉద్యోగులు మారాలని పోస్టల్​ సర్వీస్ బోర్డు బ్యాంకింగ్, డీబీటీ కమిటీ సభ్యురాలు సంధ్యారాణి సూచించారు. 2022లో 2.0 వెర్షన్​ టెక్నాలజీ పోస్టల్​ అమల్లోకి వస్తోందని పేర్కొన్నారు.

postal-department-adapt-new-technology-on-soon
'టెక్నాలజీకి అనుగుణంగా పోస్టల్​ ఉద్యోగులు మారాలి'

By

Published : Feb 16, 2021, 4:45 PM IST

కరోనా మహమ్మారి, మారుతున్న సాంకేతికత, వ్యాపార తీరు మారుతుండటం, డిమాండ్ పెరగటంతో పోస్టల్ విభాగం అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని పోస్టల్ సర్వీస్ బోర్డు బ్యాంకింగ్, డీబీటీ కమిటీ సభ్యురాలు సంధ్యరాణి అన్నారు. అబిడ్స్​లో జరిగిన డాక్ సేవ, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అవార్డుల వేడుకకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బాధ్యతగా వ్యవహరించాలి..

పోస్టల్ అంటే కేవలం ఉత్తరాలు మాత్రమే అని చాలా మంది అనుకుంటారని... కానీ 65 శాతం పోస్టల్ సేవలు బ్యాంకింగ్​కు సంబంధించినవని అన్నారు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.750 కోట్లు కమీషన్ రూపంలో డిపార్ట్​మెంట్ ఆఫ్ పోస్ట్స్​కు అందిస్తోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలందిస్తోన్న దృష్ట్యా... ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

కొత్త వెర్షన్ వస్తోంది..

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఉద్యోగులు మారాలని... 2022లో 2.0 వెర్షన్ టెక్నాలజీ పోస్టల్ అమల్లోకి వస్తోందని తెలిపారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.

ఇదీ చూడండి:మూడు లక్షల మొక్కలు నాటుతాం: మంత్రి సత్యవతి

ABOUT THE AUTHOR

...view details