Postal Ballots Issue in Telangana : పోస్టల్ బ్యాలెట్ల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. పోలింగ్ రోజు ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. గతంలో పోస్టల్ బ్యాలెట్ తీసుకుని ఓటు వేసి ఓట్ల లెక్కింపు రోజు వరకు పోస్ట్ ద్వారా పంపేవారు. అయితే పోస్టల్ బ్యాలెట్(Postal Ballots) దుర్వినియోగం అవుతోందని, ప్రలోభాలకు అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయం ఉంది. దీంతో పోస్టల్ బ్యాలెట్ల విషయమై ఈసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
Telangana Assembly Elections 2023: సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లు తీసుకొని అధికారులు ఏర్పాటు చేసే ఫెసిలిటేషన్ సెంటర్ల(Facilitation Centers)లో పోలింగ్ విధులకు వెళ్లడం కంటే ముందే బ్యాలెట్ వేయాలని ఈసీ స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీన జరిగే పోలింగ్ కోసం దాదాపు రెండు లక్షల మంది సిబ్బంది.. పోలీసులు, డ్రైవర్లు మరో లక్ష మంది ఉంటారు. వారందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారానే ఓటు హక్కు(Right to Vote) వినియోగించుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు ఈనెల 23వ తేదీతో ముగిసింది.
'మా ఓటు వినియోగంపై ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు'
EC New Rules on Postal Ballots : పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు జిల్లాల వారీగా అనుకూలమైన ప్రాంతాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయా కేంద్రాల వద్ద ఓటింగ్ కొనసాగుతుంది. అయితే మొత్తం మూడు లక్షల మందిలో 40శాతం వరకు ఉద్యోగులకు ఇంకా పోస్టల్ బ్యాలెట్ అందలేదు. దీంతో పలువురు ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడం వల్ల తాము ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోతామని తెలిపారు.