Postal Ballots Applications in Telangana Election : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను చేస్తుంది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, ఈవీఎం(EVM)ల కేటాయింపు వంటి పనుల్లో నిమగ్నమైంది. ఇందులో భాగంగా పోస్టల్ బ్యాలెట్(Postal Ballot), హోం ఓటింగ్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో సగం మాత్రమే ఆమోదం అయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది.
80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును ఇంటి వద్దే వినియోగించుకునేలా హోం ఓటింగ్ సదుపాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల విధుల్లో ఉండే 13 శాఖలు, విభాగాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి కూడా ఈ మారు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించారు. అర్హుల నుంచి ఫారం 12డీ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహాలో మొత్తం 44,097 దరఖాస్తులు వచ్చాయి.
Telangana Election 2023 :ఆ దరఖాస్తులను అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. అన్ని రకాల వివరాలు, ధ్రువపత్రాలను పరిశీలించి అందులో 28,057 దరఖాస్తులను ఆమోదించారు. ఆమోదం పొందిన వారు హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 757 దరఖాస్తులు ఆమోదం పొందాయి. బాల్కొండలో 707, సత్తుపల్లిలో 706 దరఖాస్తులను ఆమోదించారు. అతి తక్కువ సంఖ్యలో బహదూర్ పురాలో 11.. అలంపూర్, జహీరాబాద్ లో 12 చొప్పున.. గద్వాల, గోషామహల్ లో 15 చొప్పున.. దరఖాస్తులు ఆమోదం పొందాయి.
Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా