ఈనెల 14 నిర్వహించిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరూర్నగర్లో కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన పూర్తి చేశారు. అందులో చెల్లుబాటు అయ్యే పోస్టల్ బ్యాలెట్లను వేరు చేశారు.
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన పూర్తి చేశారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తైంది.
ముగిసిన పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన
అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ టేబుళ్లపైకి తరలించారు. రాత్రి 8 గంటల వరకు బ్యాలెట్ పేపర్లను కట్టలు కడతారు. తర్వాత లెక్కిస్తారు. రేపు ఉదయనికల్లా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:రేపు రాత్రికల్లా ఎమ్మెల్సీ ఫలితాలు: ప్రశాంత్ జీవన్ పాటిల్