ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులపై సినీ నటుడు, వైకాపా నాయకుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు రచయిత పోసాని కృష్ణమురళీ ఖండించారు. రాజధానికి భూములిచ్చిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం సమంజసం కాదన్నారు. అతను అమరావతి రైతులను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. పృథ్వీ లాంటి వాళ్ల వల్లే జగన్ ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని పేర్కొన్న పోసాని... రైతులను కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
పృథ్వీ వ్యాఖ్యలపై పోసాని ధ్వజం - పృథ్వీ వ్యాఖ్యలను ఖండించిన నటుడు పోసాని కృష్ణ మురళి
అమరావతి రాజధాని రైతులపై సినీ నటుడు, వైకాపా నాయకుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళీ ఖండించారు.
![పృథ్వీ వ్యాఖ్యలపై పోసాని ధ్వజం possini fire on prudhivi commments on amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5655849-397-5655849-1578588873067.jpg)
possini fire on prudhivi commments on amaravathi
TAGGED:
అమరావతిపై పృథ్వీ వ్యాఖ్యలు